ASI Mahipal Reddy killed : డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టుల్లో ప్రమాదానికి గురైన ఏఎస్‌ఐ మృతి

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడిన కేపీహెచ్‌బీ ఏఎస్‌ఐ మహిపాల్‌ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ప్రమాదం చోటు చేసుకుంది.

ASI Mahipal Reddy killed : డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టుల్లో ప్రమాదానికి గురైన ఏఎస్‌ఐ మృతి

Updated On : March 31, 2021 / 7:51 AM IST

ASI Mahipal Reddy killed : హైదరాబాద్‌ నిజాంపేటలో నాలుగు రోజుల క్రితం డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడిన కేపీహెచ్‌బీ ఏఎస్‌ఐ మహిపాల్‌ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర.. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసిన సృజన్.. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో.. అది కాస్తా ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలయ్యాయి. కారు నడిపిన వ్యక్తికి.. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే.. మీటర్ 170 దాటింది. దీంతో.. ట్రాఫిక్‌ పోలీసులు సివిల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి ASI మహిపాల్ రెడ్డి వచ్చారు. ఘటనా స్థలంలో.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండగానే.. మరోకారు మహిపాల్ రెడ్డిని ఢీకొట్టింది.

ASI తలకు తీవ్ర గాయమవడంతో.. పరిస్థితి విషమంగా మారింది. ఏఎస్‌ఐను కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిపాల్‌ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ప్రమాదం చోటు చేసుకుంది.