Telangana BJP : తెలంగాణకు మోదీ, అమిత్ షా, యోగి.. ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు
BJP Election Campaign :

BJP Election Campaign (Photo : Google)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గర పడింది. కొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుంది. ప్రచారం జోరు మరింత పెంచనుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ నాయకులు, ముఖ్య నేతలు రంగంలోకి దిగనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు(నవంబర్ 20) తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 1 గంటకు జనగామ పబ్లిక్ మీటింగ్ కు హాజరవుతారు. అక్కడ సభ అనంతరం 2.45 గంటలకు కోరుట్లకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 వరకు సభలో పాల్గొంటారు. కోరుట్ల నుంచి బయలుదేరి 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్ కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు.
Also Read : రాముడు అయోధ్యలో జన్మించారా? లేదా? కేసీఆర్ చెప్పాలి-బండి సంజయ్
అమిత్ షాతో పాటు పలువురు జాతీయ నాయకులు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నవంబర్ 25, 26 తేదీల్లో హుజురాబాద్, మహేశ్వరంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారని సమాచారం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవంబర్ 24, 25, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ 21వ తేదీన రెండు సభల్లో పాల్గొంటారు.
* నితిన్ గడ్కరీ నవంబర్ 20న ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉ. 11 30 గం.లకు, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మ.2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం రోడ్ షోలో పాల్గొంటారు.
* మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నవంబరు 20న ముషీరాబాద్ లో ఉ. 10.30 గంటలకు రోడ్ షోలో పాల్గొననున్నారు.
* నవంబర్ 24, 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షో తో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Also Read : బీజేపీ అధికారంలోకి వస్తే వారికి ఐటీ రద్దు చేస్తాం- ఈటల రాజేందర్ కీలక హామీ