Bandi Sanjay : రాముడు అయోధ్యలో జన్మించారా? లేదా? కేసీఆర్ చెప్పాలి-బండి సంజయ్
Bandi Sanjay On KCR : 12శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారు. 80 శాతమున్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా?

Bandi Sanjay On KCR (Photo : Facebook)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై విమర్శల డోస్ పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 12శాతం ఓట్ల కోసం ఒవైసీకి సలాం చేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి నారాయణఖేడ్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
నారాయణఖేడ్ లో ‘రంగస్థలం‘ మొదలైందన్నారు బండి సంజయ్. 3 ఎకరాల ‘సామాన్యుడి’కి.. 3వేల ఎకరాల ఆసామికి మధ్య జరుగుతున్నయుద్ధం ఇది అని వ్యాఖ్యానించారు. ఆ గట్టునుంటారా? ఈ గట్టున ఉంటారా? తేల్చుకోండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎవరూ భయపడాల్సిన పని లేదన్న బండి సంజయ్.. మీ వెనుక మేమున్నాం అని భరోసా ఇచ్చారు. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చినా అని అన్నారు బండి సంజయ్.
Also Read : దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత సీఎం ప్రకటన చేయాలి : వైఎస్ షర్మిల
కేసీఆర్ పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు, అయినా డోంట్ కేర్ అన్నారు బండి సంజయ్. ఒవైసీకి సవాల్ చేసి పాతబస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటామన్నారాయన. 12శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారు అని ధ్వజమెత్తిన బండి సంజయ్.. 80 శాతమున్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా? అని అడిగారు. రాముడు అయోధ్యలో జన్మించారా? లేదా? చెప్పాలని కేసీఆర్ ని అడిగారు. పొరపాటున కేసీఆర్ కు అవకాశమిస్తే.. రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఖేడ్ లో 70ఏళ్ల కుటుంబ పాలనను బద్దలుకొట్టండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు బండి సంజయ్.
సంగప్పను గెలిపిస్తే నారాయణఖేడ్ సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ హబ్ గా నారాయణఖేడ్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఆదిలాబాద్, పటాన్ చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ ను తీసుకొస్తామని వాగ్దానం చేశారు. లింగాయత్, ఆరె మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ పూర్తి కావొచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఉచిత విద్య, వైద్యం, ఫసల్ బీమా అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Also Read : తెలంగాణ పోరులో వారసులు విజయం సాధిస్తారా? హోంశాఖ మంత్రుల వారసులకు దక్కని అవకాశం