CM KCR : మళ్లీ గెలిపిస్తే రూ.16 వేలు ఇస్తాం- సీఎం కేసీఆర్ కీలక హామీ

KCR Key Promise : దశాబ్దాల తరబడి సూర్యాపేట ప్రజలకు మూసీ డ్రైనేజీ నీరుని తాపించిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్.

CM KCR : మళ్లీ గెలిపిస్తే రూ.16 వేలు ఇస్తాం- సీఎం కేసీఆర్ కీలక హామీ

KCR Key Promise

Updated On : November 21, 2023 / 6:31 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే రైతుబంధు 16వేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. మళ్లీ జగదీశ్ రెడ్డిని గెలిపిస్తే మరోసారి మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సూర్యాపేట అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను గంగలో కలపండని కేసీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మరింత అభివృద్ధి జరగాలంటే జగదీశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు గులాబీ బాస్.

”58ఏళ్లు మనల్ని ఏడిపించిందే కాంగ్రెస్ పార్టీ. రాయేందో రత్నమేదో మనం గుర్తించాలి. తలరాతను మార్చే ఓటును జాగ్రత్తగా వినియోగించాలి. రైతుబంధు 16వేలు చేస్తాం. మేధో మధనం చేసి తెలంగాణను బాగు చేసుకున్నాం. తెలంగాణలో నీటి తిప్పలు లేవు. ఏడాదిలో 10 నెలలు కాలువలు నిండుగా పారుతున్నాయి. దశాబ్దాల తరబడి సూర్యాపేట ప్రజలకు మూసీ డ్రైనేజీ నీరుని తాపించిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్.

Also Read : ఆదాయం సరే.. అప్పుల గురించి చెప్పండి.. కేటీఆర్‭కు నిర్మల స్ట్రాంగ్ కౌంటర్

మునుగోడు దేవరకొండలో ఫ్లోరోసిస్ తో ఒక లక్ష 50వేల మంది ప్రజల ఉసురు పోసుకుంది కాంగ్రెస్. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. ధాన్యం అందించడంలో పంజాబ్ ని అధిగమించాం. జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి నల్లగొండ జిల్లాలో గతంలో ఏ మంత్రి అయినా చేసిండా? జగదీశ్ రెడ్డికి ఓటు వేస్తే మెజార్టీ పెరుగుతుంది. బీజేపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే. బాయికాడ మీటర్లు పెట్టమని కేంద్రం చెప్తే నేను ఒప్పుకోలేదు. గిరిజనులకు గిరిజన బంధు ఇస్తాం. ఆటో కార్మికులకు ఫిట్ నెస్ చార్జీలు రద్దు చేస్తాం” అని హామీ ఇచ్చారు కేసీఆర్.

Also Read : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై షర్మిల మరోసారి ఘాటు విమర్శలు