Khammam BRS : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్

Shock For BRS In Khammam : ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 15 రోజులు కష్టపడి పని చేసి అరాచక పాలనను తరిమికొట్టాలి

Khammam BRS : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్

Shock For BRS In Khammam (Photo : Google)

Updated On : November 14, 2023 / 5:15 PM IST

ఖమ్మంలో అధికార బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ముక్తార్ దంపతులు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు హస్తం గూటికి చేరారు. ముక్తార్ సుడా డైరెక్టర్ గా, నగర మైనారిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వారి చేరిక సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.

”ఇప్పుడున్న వాళ్లంతా అప్పుడు టీఆర్ఎస్ నుండే గెలిచారు. నేను ఈరోజుకు ఒక్కసారి కూడా మేయర్ కి ఫోన్ చెయ్యలేదు. ఇలా అసభ్య భాషను ఎప్పుడూ వాడలేదు. మర్డర్ కేసులో కూడా ఇంత చెయ్యరు. వాళ్లపై పీడీ యాక్ట్ కేసులు, నిర్భందాలు చేశారు. అవినీతి పరిపాలన, నీచమైన, దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు.

Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వారసులు.. సత్తా నిరూపించుకుంటారా?

వాళ్ళు తట్టుకోలేక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. డిప్యూటీ మేయర్ చాలా మంచి పని చేశారు. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 15 రోజులు కష్టపడి పని చేసి అరాచక పాలనను తరిమికొట్టాలి” అని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Also Read : పార్టీ మార్పుపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్లేనా? ఆ మార్పులు దేనికి సంకేతం .. మరోసారి చర్చనీయాంశంగా విజయశాంతి పార్టీ మార్పు అంశం..