7 Crore Seized : రూ.7కోట్ల నగదు పట్టుబడిన కేసు.. 10మందికి పోలీసుల నోటీసులు
7 Crore Money Seized : ఖమ్మంకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువులకు చెందిన రెండు కార్లను సీజ్ చేశారు.

7 Crore Money Seized
హైదరాబాద్ లో నిన్న పట్టుబడిన 7కోట్ల 50లక్షల నగదు కేసులో 10మందికి 41ఏ నోటీసులను జారీ చేశారు పోలీసులు. నిన్న ఏడున్నర కోట్ల రూపాయల నగదును మొయినాబాద్ పోలీసులు సీజ్ చేశారు. మహేందర్ కు చెందిన ఫామ్ హౌస్ నుంచి డబ్బులు బయటకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఖమ్మంకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువులకు చెందిన రెండు కార్లను సీజ్ చేశారు.
మహేందర్ కు చెందిన ఫామ్ హౌస్, ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలను ఐటీ అధికారులు సేకరించారు. పట్టుబడిన డబ్బుని కోర్టులో డిపాజిట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read : బీజేపీ అధికారంలోకి వస్తే వారికి ఐటీ రద్దు చేస్తాం- ఈటల రాజేందర్ కీలక హామీ
అసెంబ్లీ ఎన్నికల వేళ మొయినాబాద్ లో కలకలం రేగింది. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఆరు కార్లలో తరలిస్తున్న 7కోట్ల 50లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలో విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి ఆరు కార్లు బయటకు వస్తుండగా.. స్థానిక పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ నిర్వహించారు. అందులో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : రాముడు అయోధ్యలో జన్మించారా? లేదా? కేసీఆర్ చెప్పాలి-బండి సంజయ్
ఎన్నికల వేళ ఇలా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది. డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు.
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బు, మందు పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు నగదుని సీజ్ చేస్తున్నారు.