Adilabad District : ఆదిలాబాద్‌లో ఆసక్తికర రాజకీయం.. త్రిముఖ పోరులో గెలుపెవరిది?

Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.

Adilabad District : ఆదిలాబాద్‌లో ఆసక్తికర రాజకీయం.. త్రిముఖ పోరులో గెలుపెవరిది?

Adilabad District Politics Battlefield

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో 9చోట్ల గులాబీ గుభాలించింది. కేవలం ఆసిఫాబాద్‌లో మాత్రమే 175 ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచినా.. ఆ తర్వాత అక్కడి ఎమ్మెల్యే సైతం కారెక్కేశారు. ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.

Also Read : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?

ఆదిలాబాద్, ముధోల్ వంటి నియోజకవర్గాల్లో గతంలో రెండో స్థానంలో నిలిచిన కమలం పార్టీ ఈసారి గెలుపు దాహం తీర్చుకోడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఇక సిర్పూర్ నుంచి పోటీ చేస్తోన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. అటు బోధ్, ఖానాపూర్, నిర్మల్ లో నువ్వా? నేనా? అన్నట్టుగా సాగుతోంది మూడు ప్రధాన పార్టీల పోరు.

ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 31మంది ప్రధాన అభ్యర్థుల బలాబలాలు.. గెలుపు అవకాశాలపై విశ్లేషణ.. ”బ్యాటిల్ ఫీల్డ్” లో..

Also Read : మహబూబ్‌నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?