Malla Reddy Chamakura : ఎన్నికల వేళ.. మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
అభ్యంతరాలు లేవనెత్తినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని పేర్కొన్నారు. హైకోర్టు ముందుకు వెళ్లినా హైకోర్టు కూడా ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు పిటిషనర్.

Malla Reddy Chamakura (Photo : Facebook)
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో ఊటర దక్కింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి మల్లారెడ్డిని నిలువరించాలని దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి మూడు అఫిడవిట్లలో మూడు విధాలుగా తన విద్యార్హతలు పొందుపరిచారని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యంతరాలు లేవనెత్తినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని పేర్కొన్నారు. హైకోర్టు ముందుకు వెళ్లినా హైకోర్టు కూడా ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు పిటిషనర్.
Also Read : ఆ నియోజకవర్గాల్లో వరదలై పారుతున్న డబ్బు.. ఒక్కో చోట రూ.100 కోట్ల పైమాటే
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్ అంజయ్ రెడ్డికి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మల్లారెడ్డి తరపున న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.