Power Cut Off : ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కరెంట్‌ కట్‌

కరెంట్‌ బిల్లు చెల్లించకపోవడంతో హెచ్‌సీఏపై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు కూడా నమోదైంది. అయితే హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్‌ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Power Cut Off : ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కరెంట్‌ కట్‌

Uppal

Updated On : December 15, 2021 / 6:46 PM IST

Rajiv Gandhi International Cricket Stadium : హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి అధికారులు కరెంట్‌ కట్‌ చేశారు. 3 కోట్ల 5 లక్షలకు పైగా విద్యుత్‌ బిల్లులు బకాయి ఉండటంతో కరెంట్‌ను నిలిపివేశారు. కరెంట్‌ బిల్లు చెల్లించకపోవడంతో హెచ్‌సీఏపై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు కూడా నమోదైంది.

అయితే హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్‌ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నోటీసులు ఇచ్చినా బిల్లు చెల్లించకపోవడంతో క్రికెట్‌ స్టేడియానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.