Hyderabad : పట్టపగలు ఆటో డ్రైవర్‌ను నరికి చంపిన దుండగులు.. 24 గంటల్లో హైదరాబాద్‌లో 5 హత్యలు

హైదరాబాద్ లో పట్టపగలు ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తరిమి తరిమి అతనిని హతమార్చారు. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.

Hyderabad : పట్టపగలు ఆటో డ్రైవర్‌ను నరికి చంపిన దుండగులు.. 24 గంటల్లో హైదరాబాద్‌లో 5 హత్యలు

Hyderabad

Updated On : June 22, 2023 / 10:40 AM IST

Hyderabad : రద్దీగా ఉండే రోడ్డు.. వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓ ఆటో డ్రైవర్‌ను ఇద్దరు వ్యక్తులు వెంబడించి దారుణంగా నరికి చంపిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం కలిగిస్తోంది.

Flyover : హైదరాబాద్‌లో కుప్పకూలిన ఫ్లైఓవర్..10 మందికి గాయాలు

చాదర్ ఘాట్‌లోని అజంపురాలో ఆటో డ్రైవర్ యూసుఫ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మహిళతో కలిసి యూసుఫ్ బైక్ మీద వెళ్తుంటే ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. వెంటనే అతను బైక్ వదిలి పరుగులు తీశాడు. అతనిని వెంబడించిన దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో యూసుఫ్ పరుగులు పెట్టాడు. అయిన ఆ వ్యక్తులు అతడిని వెంబడించి దాడి చేశారు. కుప్పకూలిన యూసుఫ్ చనిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న వారు ఎవరూ అతనిని కాపాడటానికి రాలేదు. యూసుఫ్‌పై దాడి చేసిన వారు అతని పొరుగువారైన అక్రమ్, సోహైల్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో ట్రాన్స్‌జెండర్ల హత్య

యూసుఫ్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్ సీసీ కెమెరాలో రికార్డైంది. 24 గంటల వ్యవధిలో హైదరాబాద్‌లో ఇది ఐదవ హత్యగా పోలీసులు చెబుతున్నారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు హత్యకు గురయ్యారు. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పాత్‌పై నిద్రస్తున్న మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు.