No Liquor No Non Veg: మందుబాబులు, నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పండక్కి ముక్క, చుక్క బంద్

వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

No Liquor No Non Veg: మందుబాబులు, నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పండక్కి ముక్క, చుక్క బంద్

Updated On : September 30, 2025 / 5:34 PM IST

No Liquor No Non Veg: దసరా పండగ వచ్చేస్తోంది. దసరా అంటేనే సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఇక దసరా పండగ అంటే నాన్ వెజ్ ప్రియులు, మందుబాబులకు సందడే సందడి. ఆరోజు చుక్క, ముక్క ఉండాల్సిందే. అయితే ఈసారి పండక్కి మందుబాబులు, నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగలనుంది. పండక్కి చుక్క, ముక్క బంద్ కానున్నాయి. దసరా పండగ రోజున ఆ రెండూ దొరకవు.

ఎందుకంటే.. దసరా పండుగ ఈసారి అక్టోబర్ 2న వచ్చింది. అదే రోజున మహాత్మా గాంధీ జయంతి కూడా. సాధారణంగా గాంధీ జయంతి రోజున అంటే అక్టోబర్ 2న వైన్ షాపులు, మాంసం దుకాణాలు క్లోజ్ లో ఉంటాయి. ఆరోజు ఎక్కడా మద్యం షాపులు తెరవరు. చికెన్, మటన్ షాపులు బంద్ చేస్తారు. ఇప్పుడు దసరా పండగ అక్టోబర్ 2న రావడంతో.. ఆరోజున ముక్క, చుక్క బంద్ కానున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఆదేశాలు వచ్చేశాయి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని 533 (బి) ప్రకారం స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. అధికారిక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆదేశాల అమలుకు సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరింది. గాంధీ జయంతి పవిత్రతను కాపాడడమే దీని ప్రధాన ఉద్దేశం అని అధికారులు వివరించారు. అక్టోబర్ 2న ఎవరైనా మాంసం లేదా మద్యం విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ప్రతి ఏటా మహాత్మా గాంధీ జయంతికి దేశవ్యాప్తంగా మద్యం, మాంసం షాపుల బంద్ రూల్ ను పాటిస్తున్న విషయం తెలిసిందే. ఆరోజున మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు అన్నీ పూర్తిగా బంద్ చేస్తారు. ఈ ఏడాది మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగ.. రెండూ ఒకేరోజు వచ్చాయి. దీంతో పండక్కి మద్యం, మాంసం షాపులు బంద్ కాన్నాయి.

సాధారణంగా దసరా పండుగ రోజున మాంసం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి అక్టోబర్ 2న పండగ వచ్చింది. ఆరోజున మాంసం దుకాణాలు మూసివేస్తారు. దీంతో మందు, మాంసం ప్రియులు ఈసారి ఫెస్టివల్ కి ఒకరోజు ముందే నాన్ వెజ్, లిక్కర్ ను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాంధీ జయంతి, దసరా పండుగ ఒకేరోజున రావడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయి.

Also Read: డైలమాలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. దీనిపై సస్పెన్స్