Balakrishna: టీడీపీ తెలంగాణ నేతలకు బాలకృష్ణ భరోసా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే?

తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజక వర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని అన్నారు. అంతేకాదు..

Balakrishna: టీడీపీ తెలంగాణ నేతలకు బాలకృష్ణ భరోసా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే?

Balakrishna

Telangana Elections 2023: టీడీపీ తెలంగాణ నేతలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశమయ్యారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీలో అరెస్ట్ చేయడం, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలకి దిశానిర్దేశం చేశారు.

మీకు నేనున్నాను అంటూ టీడీపీ తెలంగాణ నేతలకు బాలకృష్ణ భరోసా ఇచ్చారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పారు. పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజక వర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని అన్నారు.

తెలంగాణలో జనసేన సహా పార్టీలతో పొత్తుల అంశంపై తరువాత నిర్ణయం తీసుకుందామని తెలిపారు. తెలంగాణలోనూ తమ పార్టీకి, చంద్రబాబు నాయుడికి గొప్ప ఆదరణ ఉందని అన్నారు. చంద్రబాబు త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని తెలిపారు. పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని అన్నారు. కాగా, తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుపై స్పష్టత రావాల్సి ఉంది.

Telangana Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల