Bandi Sanjay: అమిత్ షాను కలిశాక బండి సంజయ్ అంబరాన్నంటే ఆనందం.. ఎందుకో?

భారతీయ రాజకీయాల్లో చాణక్య వంటి అమిత్ షాతో సమావేశం కావడం ఉత్సాహాన్నిస్తుందని బండి సంజయ్ చెప్పారు.

Bandi Sanjay: అమిత్ షాను కలిశాక బండి సంజయ్ అంబరాన్నంటే ఆనందం.. ఎందుకో?

Bandi Sanjay - Amit Shah

Updated On : July 24, 2023 / 3:25 PM IST

Bandi Sanjay – Amit Shah: బీజేపీ (BJP) తెలంగాణ (Telangana) ఎంపీ బండి సంజయ్ ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమిత్ షాతో పాటు బండి సంజయ్ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. అమిత్ షాను బండి సంజయ్ కలవడంపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అమిత్ షాను కలిసిన అనంతరం బండి సంజయ్ చాలా హ్యాపీగా కనపడ్డారు.

తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్ తో చర్చించానని అమిత్ షా చెప్పారు. బాగా పని చేయాలని, తాను అండగా ఉంటానని బండి సంజయ్ కి అమిత్ షా భరోసా ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. ఇప్పటికీ బండి సంజయ్ పై బాధ్యత ఉందని, బీజేపీ క్యాడర్ లో ఉత్సాహం నింపాలని అన్నట్లు తెలిసింది. దూకుడుగానే ముందుకు వెళ్లాలని అన్నారు.

తెలంగాణలో ఎన్నికల వ్యూహాలపై అమిత్ షా, బండి సంజయ్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. భారతీయ రాజకీయాల్లో చాణక్య వంటి అమిత్ షాతో సమావేశం కావడం ఉత్సాహాన్నిస్తుందని బండి సంజయ్ చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.

KTR Birthday Celebrations : విజయవాడలో ఘనంగా మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు