CM KCR : ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనిది తెలంగాణలో ఇస్తున్నాం, కేటీఆర్‌ను మరోసారి దీవించండి- సీఎం కేసీఆర్
పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. గొడ్డలి భుజాన పెట్టుకొని వాళ్లు వస్తున్నారు. CM KCR
CM KCR Slams BJP And Congress : సిరిసిల్లలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఆ పార్టీలను నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు కేసీఆర్.
వారి ఆత్మహత్యలను కేటీఆర్ అడ్డుకున్నారు:
”నా 70 ఏళ్ల జీవితంలో వందసార్లు సిరిసిల్లలో తిరిగా. అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు సజీవ జలధారగ మారింది. సమైక్య పాలనలో ప్రాంతమంతా నిర్లక్ష్యానికి గురైంది. సిరిసిల్లలో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని దండం పెట్టి పోయాను. మరమగ్గాలు ఆధునికీకరణతో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలను కేటీఆర్ అడ్డుకున్నారు. ఈసారి మనమే గెలువబోతున్నాం. కొంతమంది దుర్మార్గులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుంటారు.
Also Read : కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?
చేనేత కార్మికులను కాపాడుకోవడం కోసమే..
పేదల కోసం, ఉపాధి కల్పన కోసం బతుకమ్మ చీరలు తీసుకొచ్చాం. బతుకమ్మ చీరలు కాలబెడుతున్నారు. చేనేత కార్మికులను కాపాడుకోవడం కోసం బతుకమ్మ చీరలు తీసుకొచ్చాం. రూ.5వేల పింఛన్ మోసం చేసే పద్దతిలో ప్రకటించలేదు. సంవత్సరానికి కొంత పెంచుతాం. 3కోట్ల టన్నుల పంటలు పండించే తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తినడానికి సూపర్ ఫైన్ రైస్ ఇస్తాం. ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలామంది వస్తారు.
పెద్ద ప్రమాదం పొంచి ఉంది..
పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. కష్టపడి ధరణి పోర్టల్ తీసుకొచ్చాను. గొడ్డలి భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తున్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. ప్రభుత్వం దగ్గర అధికారం లేకుండా రైతులకే ఇచ్చాం. మీకు ఇచ్చిన అధికారాన్ని తీసివేస్తామంటుంది కాంగ్రెస్. ధరణి లేకపోతే హత్యలు జరుగుతుండేవి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వ్యవసాయానికి కరెంట్ వేస్ట్ గా ఇస్తున్నామని అంటున్నారు. చేతకాని కాంగ్రెస్ ఎపుడూ కరెంట్ సరిగా ఇవ్వలేదు.
Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?
ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ రాదు. తెలంగాణలో వస్తుంది. కరెంట్ మీటర్లు పెట్టాలంటున్నారు ప్రధాని మోదీ. హిందువులు, ముస్లింలు పంచాయతీ పెట్టాలని చాలామంది ఉన్నారు. అందరూ కేటీఆర్ ను మరోసారి దీవించండి” అని సీఎం కేసీఆర్ కోరారు.
మంత్రి కేటీఆర్ కామెంట్స్..
కలలో కూడా ఊహించని సంక్షేమం రాష్ట్రంలో జరుగుతోంది. అందులో రాజన్న సిరిసిల్లలో జరుగుతోంది. కాళేశ్వరం జలాల ద్వారా బీడు భూములకు నీరు పారుతుంది. ఎర్రటి ఎండలో అప్పర్ మానేరు మత్తడి దూకుతుంది. నేతన్న ఆత్మహత్యలతో ఆనాడు ఉరిశాలగా ఉండేది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత అభివృద్ధి జరుగుతోంది. ఆరున్నర మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయి. సిరిసిల్లలో గులాబీ జెండా ఎగురవేస్తాం. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా సిరిసిల్ల ప్రజలు ఆశీర్వాదం అందిస్తారు.
Also Read : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?