విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. వచ్చే విద్యా సంవత్సరంకు పరీక్షా విధానంలో కీలక మార్పులు..

ప్రతిపాదన క్యాలెండర్ ను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే, ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా.. యథావిధిగా ప్రకటిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. వచ్చే విద్యా సంవత్సరంకు పరీక్షా విధానంలో కీలక మార్పులు..

School Education Telangana

Updated On : April 28, 2025 / 12:09 PM IST

Telangana Academic Year 2025-26: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26)లో 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతీయేటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాల్సి ఉంది. అయితే, విద్యాశాఖ అధికారులు అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు. ప్రతిపాదన క్యాలెండర్ ను ప్రభుత్వానికి పంపనున్నారు.

Also Read: తెలంగాణలో టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్.. మెమోల విధానంలో కీలక మార్పులు.. సబ్జెక్టుల వారిగా మార్కులు, గ్రేడ్లు

ప్రతియేటా సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్ష దసరా సెలవుల కంటే ముందే నిర్వహిస్తారు. అయితే, వచ్చే విద్యా సంవత్సరంలో దసరా సెలవుల తరువాత ఎస్ఏ-1 పరీక్ష నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ నిర్ణయించింది. ఈసారి దసరా పండుగ ముందుగా వస్తున్నందున పండుగ సెలవుల తరువాత అక్టోబర్ చివరి వారంలో ఎస్ఏ-1 పరీక్ష జరపాలని నిర్ణయించారు.

Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికి అప్లయ్ చేశారా? మీరు ఈ కేటగిరీలో ఉంటే.. మీకు ఇల్లు రాదు..

ప్రతీయేటా ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలు నాలుగు దఫాలుగా జరుగుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని రెండుకు తగ్గించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవటంతో ఎప్పటిలాగే నాలుగు సార్లు ఎఫ్ఏ పరీక్షలు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ అధికారుల రూపొందించారు. ప్రతీయేటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు జయశంకర్ బడిబాటను జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముందుగా నిర్వహించాలని తొలుత భావించినా.. అకడమిక్ క్యాలెండర్ లో మాత్రం యథావిధిగానే బడిబాట కార్యక్రమం నిర్వహించేలా పొందుపర్చినట్లు తెలిసింది.

ప్రతిపాదన క్యాలెండర్ ను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే, ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా..? ఎస్ఏ-1, ఎఫ్ఏలలో ఏమైనా మార్పులు చేస్తుందా.. యథావిధిగా అమోదం తెలుపుతుందా అనేది వేచి చూడాల్సిందే.