బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆ 9 మంది ఎమ్మెల్యేలు.. ఎవరెవరంటే..?

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారట.

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆ 9 మంది ఎమ్మెల్యేలు.. ఎవరెవరంటే..?

Updated On : July 12, 2024 / 6:56 PM IST

Joinings In Congress : గ్రేటర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురి పెట్టింది. ఒక్కొక్కరిని వరుసగా పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రేపు, ఎల్లుండి కూడా మరికొన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేపు (జూలై 13) కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

ఎల్లుండి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారట. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే వాతావరణం కనపడుతోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నారట. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సైతం కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని సమాచారం. వీరు ఏ క్షణమైనా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Also Read : కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం బెడిసికొట్టిందా? కొత్త సమస్య తెచ్చి పెట్టిందా?

బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కారు వీడి హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు.