దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతుంది, 100కు పైగా స్థానాల్లో బీజేపీదే గెలుపు

  • Published By: naveen ,Published On : November 18, 2020 / 05:57 PM IST
దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతుంది, 100కు పైగా స్థానాల్లో బీజేపీదే గెలుపు

Updated On : November 18, 2020 / 5:57 PM IST

bandi sanjay ghmc: జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ వేడిని పెంచాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు సై అంటే సై అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 110 సీట్లతో గెలుపు మాదే అని సీఎం కేసీఆర్ జోస్యం చెబితే, బీజేపీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. 100కు పైగా స్థానాల్లో బీజేపీదే గెలుపు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో ఎంఐఎం ఆగడాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. బీజేపీ ముమ్మాటికీ హిందువుల పార్టీ అని చెప్పారు. దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దేశద్రోహులకు అవకాశం ఇస్తారో, దేశ భక్తులకు చాన్స్ ఇస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని బండి సంజయ్ అన్నారు.

కాగా, గ్రేటర్ ఎన్నికల్లో సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అంటున్నారు. జీహెచ్ఎంసీలో 110కు పైగా స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ చెప్పారు.