Eatala Rajender: బీజేపీలో చేరాక.. రాజకీయాలే వదిలేద్దాం అనుకున్నా..! 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..
ఆనాడు పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు. ఎవరూ రావటం లేదు. కారణాలు ఏవైనా కావొచ్చు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.
Eatala Rajender: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీజేపీ కీలక నేత, ఎంపీ ఈటల రాజేందర్ పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో రాజకీయాలే వదిలేద్దాం అని అనుకున్నట్లు చెప్పారు.
”గత ఎన్నికల ముందు బీజేపీకి మంచి అవకాశం వచ్చింది. పార్టీకి బూస్ట్ వచ్చింది. ట్రయాంగిల్ ఫైట్ లో హంగ్ వస్తుంది అన్న చర్చ జరిగిన టైమ్ లో.. బీజేపీలో అంతర్గత గొడవలు, తగాదాలు, సంజయ్ ను మీరు లాగారని, మీరు అధ్యక్షుడు కావాలని అనుకున్నారని ఇలాంటి చర్చ నడిచింది. దాంతో బీజేపీ దెబ్బతింది అన్నదానికి మీరు ఏం చెబుతారు?”..
”ఒక తప్పుడు చర్చ జరిగింది. తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. అధ్యక్షుడు కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆనాడు పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు. ఎవరూ రావటం లేదు. కారణాలు ఏవైనా కావొచ్చు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. వివేక్, జితేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పలు కారణాలతో వెళ్లిపోయారు. వచ్చే వాళ్లు కూడా పార్టీలోకి రాలేదు. అప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టాను. ఎవరూ రారిక, పాత నాయకత్వాన్నే కొనసాగించుకోండి, మార్చకండి ఇక అని ప్రతిపాదన చేశాను. బండి సంజయ్ నే ఉంచండని చెప్పా. ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని కూడా చెప్పా. ఇంకా ఫైనల్ గా ఏం చెప్పానంటే.. నాలాంటి వాడిని కూడా వదిలిపెట్టుకుంటే.. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా. సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఇన్నాళ్లు ఉండి, ఆ సిస్టమ్ లో పని చేసినోళ్లకు ఉండే అనుభవం బయటి నుంచి వచ్చినోళ్లకు ఉండే ఆస్కారం లేదు. కాబట్టి ఉన్నంతలో మనంతలో మనం మెదులుదాం అని ప్రతిపాదన పెట్టా” అని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read: పేదల ఇళ్లే కూలుస్తారా? పెద్దోళ్ల జోలికి వెళ్లరా? హైడ్రాపై నిప్పులు చెరిగిన కేటీఆర్..
