MP Raghunandan Rao : ఇది మెదక్ ప్రజల విజయం.. మోదీ నాయకత్వంలో పనిచేస్తాను : ఎంపీ రఘునందన్ రావు
MP Raghunandan Rao : తెలంగాణకు రావాల్సిన ప్రతి రూపాయిని బీజేపీ నేతలుగా మేం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏగా పోటీ చేశాం.. ఎన్డీఏగానే కేంద్రంలో అధికారం చేపడుతామన్నారు.

BJP MP Raghunandan Rao Comments ( Image Credit : Google )
MP Raghunandan Rao : 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు ఓటమిపాలయ్యారు.
లోక్‌సభ ఫలితాల అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు 10టీవీతో మాట్లాడుతూ.. ఇది మెదక్ ప్రజల విజయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు. డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనే రాజకీయాలకు చరమగీతం పాడైనట్టయిందని అన్నారు.
Read Also : వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం.. భారీగా తగ్గిన మెజారిటీ
ఏడు నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలను సమీక్ష చేసుకుని పార్టీని మెదక్ పార్లమెంట్‌లో అగ్రగామికి తీసుకెళ్తానని తెలిపారు. గొంతులేని వారి పక్షాన గొంతునై నిలుస్తానని చెప్పారు. ఏడు నియోజకవర్గాల ప్రజలను కాపాడుకుంటానని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేకపోతే ముఖ్యమంత్రి కారు పెట్రోల్‌కు పైసల్లేవని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.
తెలంగాణకు రావాల్సిన ప్రతి రూపాయిని బీజేపీ నేతలుగా మేం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏగా పోటీ చేశాం.. ఎన్డీఏగానే కేంద్రంలో అధికారం చేపడుతామన్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వెలుబడే నాటికి బీజేపీకి 20070 సీట్లు దాటుతాయని నమ్మకం ఉందన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే మాటలు వారి అహంకారిత పూరితానికి నిదర్శనమని రఘునందన్ రావు విమర్శించారు.
Read Also : Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన చంద్రబాబు.. అక్కడే అకీరా..