BJP BL Santosh : తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. స్థానిక నేతనే ముఖ్యమంత్రి : బీజేపీ నేత బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో స్థానిక నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను టీఆర్ఎస్ తెస్తే ఎందుకు భయం అని అడిగారు. తెలంగాణ సెంటిమెంట్ కు తాము అనుకూలంగానే ఉంటామని చెప్పారు.

BJP BL Santosh : తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. స్థానిక నేతనే ముఖ్యమంత్రి : బీజేపీ నేత బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

Bl Santosh

Updated On : March 29, 2022 / 5:35 PM IST

BJP BL Santosh comments : బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో బీజేపీలోకి చాలామంది ముఖ్య నాయకులు వస్తారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రాబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ కార్యాలయంలో మంగళవారం(మార్చి 29,2022) కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరైన బీఎల్ సంతోష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త-పాత తేడాలు పక్కన పెట్టాలన్నారు. పనిచేసే వారికే ప్రాధాన్యత..ఎక్కడున్నా గుర్తిస్తామని చెప్పారు. యూపీలో ముగ్గురు దళిత మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ పని చేయాలని సూచించారు. తెలంగాణ వారినే సీఎం చేస్తాం కానీ.. పక్క రాష్ట్రం వారిని కాదు కదా అన్నారు.

BJP Foundation day: బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న మోదీ

తెలంగాణలో స్థానిక నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను టీఆర్ఎస్ తెస్తే ఎందుకు భయం అని అడిగారు. తెలంగాణ సెంటిమెంట్ కు తాము అనుకూలంగానే ఉంటామని చెప్పారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ నేతలు హాజరయ్యారు.