Bandi Sanjay : బండి సంజయ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్ర దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

Bandi Sanjay
TRS activists blocked Bandi Sanjay : నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్ర దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఆందోళనలతో అక్కడ టెన్షన్ వాతావారణ ఏర్పడింది.
ఇవాళ అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు బండి సంజయ్ వెళ్లారు. ఇది తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయను రాహదారి మధ్యలోనే అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ.. నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా అటు బీజేపీ శ్రేణులు కూడా నినాదాలు చేశాయి.
TRS MLC candidates : ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.