BJP Sabha : నేడు బీజేపీ విజయ సంకల్ప సభ..పరేడ్‌ గ్రౌండ్‌లో సర్వం సిద్ధం

సభ కోసం.. 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై.. ప్రధాని మోదీ, జేపీ నడ్డాతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు మాత్రమే ఉంటారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర బీజేపీ నేతలకు.. వేర్వేరుగా వేదికలు ఉన్నాయి.

BJP Sabha : నేడు బీజేపీ విజయ సంకల్ప సభ..పరేడ్‌ గ్రౌండ్‌లో సర్వం సిద్ధం

Bjp Meeting

Updated On : July 3, 2022 / 7:40 AM IST

BJP Sabha : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత భారీ బహిరంగ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో మోదీ ప్రసంగిస్తారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి రోడ్‌మ్యాప్‌ ఇవ్వనున్నారు. ఇవాళ్టి సభతో కార్యకవర్గ సమావేశాలు ముగియనున్నాయి.

సభ కోసం.. 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై.. ప్రధాని మోదీ, జేపీ నడ్డాతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు మాత్రమే ఉంటారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర బీజేపీ నేతలకు.. వేర్వేరుగా వేదికలు ఉన్నాయి. దాదాపు.. 10 లక్షల మంది బీజేపీ శ్రేణులు, ప్రజలు తరలివస్తారని.. కాషాయ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం

వర్షం పడినా.. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు, శక్తి కేంద్రాల స్థాయిలో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. కార్యకర్త స్థాయి నుంచి కింది స్థాయి నాయకుల వరకు అంతా.. పరేడ్ గ్రౌండ్‌కు తరలివచ్చేలా ప్లాన్ చేశారు.

ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు పాల్గొంటున్న ఈ సభకు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 3వేల మందితో పోలీసులు భద్రత కల్పించారు. సభ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.