Nirmal : తెలంగాణలో ‘బ్లాక్ ఫంగస్’..ఒకరు మృతి, ప్రజల్లో ఆందోళన

Nirmal : తెలంగాణలో ‘బ్లాక్ ఫంగస్’..ఒకరు మృతి, ప్రజల్లో ఆందోళన

Telangana

Updated On : May 13, 2021 / 7:26 PM IST

Telangana : తెలంగాణ రాష్ట్రంలో ‘బ్లాక్ ఫంగస్’ కేసులు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ముగ్గురిలో ఒకరు చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

దీనిపై తెలంగాణ డీఎంఈ (డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్) రమేశ్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని, ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ ఫంగస్ కేసులను గాంధీ ఆసుపత్రికి పంపుతామని అడుగుతున్నారని వెల్లడించారు.

ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్ కు ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయని, కోవిడ్ సోకిన ప్రతొక్కరికీ బ్లాక ఫంగస్ రాదన్నారు. బ్లాక్ ఫంగస్ కొందరికి మాత్రమే వస్తుందన్నారు డీఎంఈ రమేశ్ రెడ్డి.

Read More : Andhra Pradesh Corona : ఏపీలో కరోనా, 22 వేల 399 కేసులు, 89 మంది మృతి