ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోకూడా ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Former Minister Jagadish Reddy
Former Minister Jagadish Reddy : మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన సభ సెక్రటరీకి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.. పోచారం, సంజయ్ లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని జగదీశ్ రెడ్డి అన్నారు.
Also Read : జగన్‌కు ప్రతిపక్ష నేతగా అవకాశం లేదు.. ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల కేశవ్
స్పీకర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం.. కానీ, స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ కారణంగా మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరామని జగదీశ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఫిర్యాదును పంపించాం. ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులు కాంగ్రెస్ కు గుర్తులేదా అంటూ జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : న్యూలుక్‌లో రాహుల్ గాంధీ.. సంప్రదాయ రాజకీయ నేత ఆహర్యంతో..
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోకూడా ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మా హయాంలో జరిగిన ఫిరాయింపులపై స్పందిస్తే మేము ఏం చేశామో తెలుస్తుంది. మేము మా అధినేతను కలిస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు భయం అంటూ జగదీశ్వర్ రెడ్డి అన్నారు.