BRS Formation Day : ఈ నెల 27న తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
BRS Formation Day : అక్టోబర్ 10న వరంగల్ లో బీఆర్ఎస్ మహాసభ జరగనుంది. 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహిస్తారు.

BRS Formation Day (Photo : Google)
BRS Formation Day : పార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు చేయనుంది. ఈ నెల 27న హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అదేరోజున కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అనంతరం వాటికి ఆమోదం తెలుపుతారు.
అక్టోబర్ 10న వరంగల్ లో బీఆర్ఎస్ మహాసభ విస్తృతంగా జరగనుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహిస్తారు.
Also Read..Jupalli Krishna Rao : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి : జూపల్లి కృష్ణారావు
పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగించాలని సూచించారు. ఇక కంటోన్మెంట్, గోషామహల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు కేసీఆర్. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జిగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జిగా ఎంపీ మాలోతు కవితలను నియమించారు.(BRS Formation Day)
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. 27న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందన్నారు. దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జాతీయ కార్యవర్గంలోని నేతలు కూడా హాజరుకానున్నారు. అప్పటివరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన తీరుపై పార్టీ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు చేశారు.
ఈ నెల 25న అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని, కనీసం 3వేల మందిని ఆ సమావేశానికి (పార్టీలోని కీలక నేతలు, పదవుల్లో ఉన్న నేతలతో పాటు ప్రజాప్రతినిధులు) ఆహ్వానించి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలను పూర్తి స్తాయిలో వివరించాలని కేటీఆర్ చెప్పారు.