Kavitha Kalvakuntla : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఆమె ఏమన్నారంటే..

మాకు ఏ పార్టీతో జట్టు లేదు. తెలంగాణ ప్రజలే మా జట్టు అని కవిత తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. Kavitha Kalvakuntla

Kavitha Kalvakuntla : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఆమె ఏమన్నారంటే..

Kavitha Kalvakuntla On Chandrababu Arrest (Photo : Google)

Updated On : October 28, 2023 / 9:27 PM IST

Kavitha Kalvakuntla On Chandrababu Arrest : ట్విట్టర్ లో “ఆస్క్ కవిత” కార్యక్రమంలో పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులతో పాటు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు కవిత. చంద్రబాబు అరెస్ట్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. కవిత స్పందించారు. ”ఈ వయసులో చంద్రబాబుకి జరుగుతున్నది దురదృష్టకరం. ఆయన కుటుంబం బాధను నేను అర్థం చేసుకున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యులకు నా సానుభూతి అని రిప్లయ్ ఇచ్చారు కవిత.

ఇక పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు.. మాకు ఏ పార్టీతో జట్టు లేదు. తెలంగాణ ప్రజలే మా జట్టు అని కవిత తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఇటీవలే పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్న వారు వీరే

”రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకుంది. బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మిక్కే. బీజేపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు సర్వేల్లో మాత్రమే గెలుస్తాయి. మేము ఎన్నికల్లో గెలుస్తాం. ద్రోహం చేయడమే తెలంగాణకు కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం. తెలంగాణ అంశాలపై ఒక్కసారైనా పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడారా? రాహుల్ గాంధీ.. ఎన్నికల గాంధీ. ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు, పోతారు. తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర శూన్యం. మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది” అని ట్విట్టర్ లో “ఆస్క్ కవిత” కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కల్వకుంట్ల కవిత సమాధానాలు ఇచ్చారు.

Also Read : మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్- మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు