MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. ధర్నా వేదికను మార్చుకోవాలన్న పోలీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపటి ధర్నా కార్యక్రమ వేదికను మార్చుకోవాలని ఆమెకు ఢిల్లీ పొలీసులు సూచించారు. దీంతో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ధర్నా కోసం భారత్ జాగృతి ముందుగానే అనుమతి తీసుకుందని గుర్తు చేశారు. కాసేపట్లో తాను వేదిక ప్రాంగణానికి వెళ్తానని, యథాతథంగా ధర్నా ఉంటుందని చెప్పారు. వేదిక మార్చుకోవాలని ఢిల్లీ పోలీసులు ఎందుకు చెప్పారో తెలియదని అన్నారు.

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. ధర్నా వేదికను మార్చుకోవాలన్న పోలీసులు

MLC Kavitha

Updated On : March 9, 2023 / 3:08 PM IST

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపటి ధర్నా కార్యక్రమ వేదికను మార్చుకోవాలని ఆమెకు ఢిల్లీ పొలీసులు సూచించారు. దీంతో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ధర్నా కోసం భారత్ జాగృతి ముందుగానే అనుమతి తీసుకుందని గుర్తు చేశారు. కాసేపట్లో తాను వేదిక ప్రాంగణానికి వెళ్తానని, యథాతథంగా ధర్నా ఉంటుందని చెప్పారు. వేదిక మార్చుకోవాలని ఢిల్లీ పోలీసులు ఎందుకు చెప్పారో తెలియదని అన్నారు.

ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నానని కవిత తెలిపారు. అనుకున్న సమయానికే ధర్నా ఉంటుందని స్పష్టం చేశారు.  ధర్నా జరిగే ప్రాంతంలో కొంత ఇతరులకు ఇవ్వకుండా మొత్తం జాగృతి సంస్థకు కేటాయించాలని కోరామని కవిత చెప్పారు. జంతర్ మంతర్ వద్ద సగం స్థలం వాడుకోవాలని పోలీసులు సూచించారని తెలిపారు. అయితే, తాము 5 వేల మంది ధర్నాకు హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

తాము ధర్నా చేసే ప్రాంతంలో ఇతరులు కూడా ధర్నా చేస్తున్నారని తమకు తెలియదని కవిత వ్యాఖ్యానించారు. అకస్మాత్తుగా ఇతరులు వేరే అంశంపై ధర్నాకు దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారని అన్నారు. కాగా, ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కవిత కలవనున్నారు. రేపటి మహిళా రిజర్వేషన్ ధర్నాకు ఏచూరిని ఆహ్వానించనున్నారు. మరోవైపు, ఢిల్లీ జంతర్ మంతర్ లో రేపు ధర్నా జరిగే స్థలం విషయంలో పోలీసులు, భారత జాగృతి నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమె జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద రేపు ఉదయం నుంచి దీక్షకు దిగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించి, అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

తమ దీక్షకు అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలను, మహిళా నేతలను ఆహ్వానించామని కవిత ఇప్పటికే చెప్పారు. అంతేగాక, పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సమస్యలపై పోరాడుతున్న వారందరినీ ఆహ్వానించామని అన్నారు. అయితే, లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉండడం, ఈడీ విచారణకు పిలవడం వల్లే ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి కవిత దీక్షకు దిగుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Professor Kodandaram: కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం