వివాహేతర సంబంధం.. చెట్టుకు కట్టేసి కండ్లలో కారం చల్లి.. రాళ్లతో కొట్టి చంపేశారు.. నల్గొండ జిల్లాలో ఘటన
నల్గొండ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..

Nalgonda District: నల్గొండ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో యువకుడ్ని చెట్టుకు కట్టేసి కండ్లలో కారంపోసి దారుణంగా కొట్టి హతమార్చారు. ఆ తరువాత భార్యాభర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం నోముల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్యం (34) తన తల్లితో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనమ్మ అనే వివాహితతో ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో పలుసార్లు గొడవలు జరిగాయి. గతేడాది అక్టోబర్ లో ధనమ్మ ఆమె భర్త నాగరాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జానయ్య జైలుకు వెళ్లాడు. కొన్ని నెలల తరువాత జైలు నుంచి బయటకు వచ్చి గ్రామంలో ఉంటున్నాడు. కొన్ని నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్న జానయ్య.. శుక్రవారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి వెళ్లాడు.
జానయ్య ధనమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే, ధనమ్మ, జానయ్య మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయాన్ని ధనమ్మ కుమార్తె తండ్రి నాగరాజుకు ఫోన్ చేసి చెప్పింది. నాగరాజు ఇంటికి వచ్చిన తరువాత.. భార్య ధనమ్మ, కూతురు, ధనమ్మ తల్లితో కలిసి జానయ్య ఇంటికెళ్లాడు. అక్కడ జానయ్యను విచక్షణా రహితంగా కొట్టారు. కండ్లలో కారం పోసి, మర్మాగాలు, చాతిపై పిడిగుద్దులు గుద్ది, పత్తిచేనులో వాడే గడ్డిపారతో శరీర భాగాలను చెక్కారు. అనంతరం చీరతో అక్కడేఉన్న చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. మధ్యాహ్నం సమయంలో జానయ్యను ఆస్పత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ధనమ్మ, నాగరాజు దంపతులు నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపయారు.