Cash Theft : కూకట్ పల్లిలో కాల్పులు, 8 గంటల్లోనే దుండగుల పట్టివేత

కూకట్ పల్లి బ్యాంకు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లిన..దొంగలను పోలీసులు పట్టుకున్నారు.

Cash Theft : కూకట్ పల్లిలో కాల్పులు, 8 గంటల్లోనే దుండగుల పట్టివేత

Kukatpally

Updated On : April 30, 2021 / 12:56 AM IST

Kukatpally : కూకట్ పల్లి బ్యాంకు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లిన..దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి గుండా నిందితులు నాందెడ్ కు పారిపోతుండగా.. వీరిని..ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు కేలం 8 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో బ్యాంకు చోరికి పాల్పడిన ముఠానే..తేలిందని పోలీసులు వెల్లడించారు.

బేగంపేటలో ఉన్న HDFC BANK తమ పరిధిలో ఉన్న ఏటీఎంలలో బ్యాంకు సిబ్బంది డబ్బులు నింపేందుకు వెళుతుంటారు. మొత్తం రూ. 2 కోట్ల 70 వేలతో సిబ్బంది బయలుదేరారు. చిత్తల శ్రీనివాస్, సెక్యూర్టీ గార్డు సుభాన్ ఆలీ ఇతరులున్నారు. వివేకానందనగర్ లో ఉన్న ఏటీఎంలో రూ. 10 లక్షలు జమ చేసిన తర్వాత..కూకట్ పల్లిలో ఉన్న ఏటీఎంకు వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు.

ఇక్కడ రూ. 12 లక్షలు జమ చేయాల్సి ఉంది. సిబ్బంది లోనికి వెళ్లారు. కరెక్టుగా 2.10 గంటలకు దుండగులు అక్కడకు చేరుకుని సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ ఏటీఎం గ్లాస్ కు తగిలింది. అంతలో ఆలీ అప్రమత్తమయ్యాడు. సెక్యూర్టీ డ్రెస్ లో ఉన్న ఆలీపై కాల్పులు జరపడంతో కుప్పకూలి చనిపోయాడు. రూ. 12 లక్షలు లాక్కొనేందుకు ప్రయత్నించారు దుండగులు.

సూపర్ వైజర్ శ్రీనివాస్ ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇతనిపై కూడా కాల్పులు జరిపారు. ఇతని కాలికి గాయమైంది. చేతికి అందిన రూ. 5 లక్షలు తీసుకుని వచ్చిన పల్సర్ బైక్ పై పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులు అక్కడ వదిలేసిన గన్ మేగజైన్, హెల్మెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read More :  CID Investigation : బాబు పేరు చెప్పాలంట..లోకేష్ ను తీసుకొస్తారంట – దేవినేని ఉమ