Cast Your Vote : ఓటు హక్కును వినియోగించుకోండి… ఓటర్లకు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మెసేజులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన యాప్ ద్వారా ఓటర్లకు గురువారం తెల్లవారుజామున మెసేజులు పంపించింది....

Cast Your Vote : ఓటు హక్కును వినియోగించుకోండి… ఓటర్లకు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మెసేజులు

cast your vote

Cast Your Vote : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన యాప్ ద్వారా ఓటర్లకు గురువారం తెల్లవారుజామున మెసేజులు పంపించింది. ‘‘నవంబర్ 30వతేదీ పోలింగ్ రోజున మీ ఓటు వేయండి, బలమైన ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించడంలో భాగం వహించండి’’ అంటూ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పేరిట ఓటర్లకు ఫోన్ మెసేజులు వచ్చాయి.

ALSO READ : Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగుకు మూడంచెల భద్రత

ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఈ మెసేజులు పంపించింది. ఈ మెసేజులో లింక్ పంపించారు. ఆ లింక్ ను క్లిక్ చేస్తే మీ పోలింగ్ స్టేషన్ క్యూ స్థితిని తెలుసుకోవచ్చు. దీంతోపాటు పోల్ క్యూ రూట్ అప్లికేషన్ ను ఉపయోగించి పోలింగ్ కేంద్రానికి మార్గాన్ని కూడా చూడొచ్చు. ప్రతీ ఓటు లెక్కిస్తామని ప్రియమైన పౌరులందరూ ఓటేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పేరిట వచ్చిన మెసేజులో పేర్కొన్నారు.

తెల్లవారుజామున 5.30 గంటలకే మాక్ పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. అన్ని పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగులో ఈవీఎం సమస్య తలెత్తితే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.

దేేవాలయాల్లో అభ్యర్థుల ప్రత్యేక పూజలు

గురువారం పోలింగ్ సందర్భంగా అన్ని పార్టీల అభ్యర్థులు దేవాలయాలకు వెళ్లి తమ ఇష్టదైవానికి పూజలు చేసిన తర్వాత ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. పలు పార్టీల అభ్యర్థులు తెల్లవారుజామునే పూజాదికాలతో పోలింగ్ పర్యవేక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.