Jeevan Reddy : కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాలి- జీవన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాలి. ప్రధాని మోదీ, బండి సంజయ్ సైతం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.

Jeevan Reddy : కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాలి- జీవన్ రెడ్డి

Jeevan Reddy

Updated On : February 18, 2022 / 5:52 PM IST

Jeevan Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాలని పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను కొన్ని చోట్ల కాంగ్రెస్- బీజేపీ వాళ్లు కూడా చేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ, బండి సంజయ్ సైతం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ 68వ బర్త్ డే వేడుకలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఘనంగా జరిగాయి. బీజేపీ ఇలాకా అయిన గుజరాత్ తో పాటు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలోనూ.. కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు జోరుగా దర్శనమిచ్చాయి. దేశ్ కీ నేతా.. కేసీఆర్ అంటూ ఇంగ్లిష్, హిందీలో ప్రచారాలు.. స్థానిక ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ తో పాటు.. కేసీఆర్ నివాసం దగ్గర కూడా.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కటౌట్లు, ఫ్లెక్సీలతో సందడి కనిపించింది. జాతీయ రాజకీయాల్లో కాలు మోపాలన్న కేసీఆర్ దూకుడుకు మరింత ఊతం కల్పించేలా.. ఈ ప్రచారం అందరినీ ఆకర్షించింది.

Desh Ki Neta KCR: దేశ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు.. జోరుగా గులాబీ బాస్ పుట్టినరోజు సంబరాలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఊసరవెల్లి వంశోద్ధారకుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. పెయింటర్ రెడ్డి.. ఊసరవెల్లి టైప్ లో రంగులు మారుస్తూ పార్టీలు మార్చారని ధ్వజమెత్తారు. ఊసరవెల్లి ఎవరో.. మారిన పార్టీల గురించి తెలిసిన ప్రజలే చెప్తారని అన్నారు. రేవంత్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక చేసింది ఏంటి? అని నిలదీశారు. జోకర్ మాటలు, బ్రోకర్ దందాలు తప్ప అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పుట్టిన రోజును
నేరస్తుల దినంగా ప్రకటిస్తున్నాం అన్నారు. గోడలకు కలర్లు మార్చినట్టు పార్టీలు మార్చే రేవంత్ రెడ్డి ఊసరవెల్లి అనే పదానికి కరెక్ట్ గా సెట్ అవుతారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

CM KCR Birthday : సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ

”పీసీసీని.. పిచ్చి కాంగ్రెస్ కమిటీగా, గాంధీ భవన్ ను బ్రాందీ భవన్ గా రేవంత్ రెడ్డి మార్చారు. ఊసరవెల్లి వంశానికే రేవంత్ రెడ్డి పెద్ద. ఇప్పటివరకు అన్ని రంగులు మార్చారు. 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి గ్రామ శునకం తప్ప ఎవరూ టీపీసీసీ దొరకలేదా? రాహుల్ గాంధీపై అసభ్యకరంగా అసోం సీఎం మాట్లాడితే మొదటగా ఖండించింది ముఖ్యమంత్రి కేసీఆర్. రేవంత్ రెడ్డి మర్యాదగా మాట్లాడకపోతే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వము” అని వార్నింగ్ ఇచ్చారు జీవన్ రెడ్డి.

సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఊసరవెల్లి ఫోటోలు షేర్ చేస్తూ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ మాటలు ఊసరవెల్లిలా ఉంటాయని అర్థం వచ్చేలా ఈ ఫోటోని షేర్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే… రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు జీవన్ రెడ్డి.