Bandi Sanjay : బండి సంజయ్‌కి అమిత్ షా ఫోన్

సోమవారం బండి సంజయ్ కాన్వాయ్‌పై జరిగిన దాడి బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంజయ్‌కి ఫోన్ చేశారు.

Bandi Sanjay : బండి సంజయ్‌కి అమిత్ షా ఫోన్

Bandi Sanjay (2)

Updated On : November 16, 2021 / 10:17 AM IST

Bandi Sanjay : సోమవారం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు నల్గొండ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్‌ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే.. ఈ సమయంలోనే ఆయన కాన్వాయ్ పై కొందరు రాళ్లదాడి చేశారు. ఈ దాడి విషయం బీజేపీ జాతీయ పెద్దల దృష్టికి వెళ్లడంతో పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాన్వాయ్‌పై జరిగిన దాడి గురించి ఆరా తీశారు.. కేంద్ర నాయకత్వం అండగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.  ఈ ఘటనపై తాను డీజీపీతో మాట్లాడతానని షా, సంజయ్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి : Bandi Sanjay : రైతుల పట్ల గజినిగా మారిన సీఎం కేసీఆర్ : బండి సంజయ్

ఇక ఇదే వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేయవచ్చని.. కానీ నిరసన పేరా రాళ్లదాడి చేసి హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ ఘటనపై ఈ రోజు పార్టీ కీలక నేతలు జనగామలో భేటీ కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి : Amith Shah: రైతు సంక్షేమమే వెంకయ్య లక్ష్యం!