Chevella Road Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. గుండెను పిండేసే దృశ్యాలు.. మృతులు వీరే..
Chevella Road Accident : వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి.
Chevella Road Accident
Chevella Road Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనంలో డ్రైవర్ల వైపు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. అయితే, ప్రమాదంలో సమయంలో టిప్పర్ లారీ ట్రక్కులో నిండుగా కంకర ఉండటంతో ఆ కంకర మొత్తం బస్సు ముందుభాగంలో కూర్చుకున్న ప్రయాణికులపై పడింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్ సహా 19మంది ప్రయాణికులు మరణించారు.

ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. బస్సులోని కొందరు ప్రయాణికులు కంకరలో సగం వరకు కూరుకుపోయి తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని జేసీబీ సహాయంతో కంకరను తొలగించారు. తద్వారా కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. తీవ్ర గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ సహా ఏడుగురు పురుషులతోపాటు 12మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

ఈ ఘటనలో పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు.
దస్తగిరి బాబా ( బస్సు డ్రైవర్),
తారిబాయ్ (45) దన్నారం తండా,
కల్పన(45) బోరబండ,
బచ్చన్ నాగమణి (55) భానూరు,
ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ,
మల్లగండ్ల హనుమంతు (దౌల్తాబాద్ మండలం)
గుర్రాల అభిత (21) యాలాల్
గోగుల గుణమ్మ (బోరబండ),
షేక్ ఖాలీద్ హుస్సేన్ (తాండూరు)
తబస్సుమ్ జహాన్ (తాండూరు)

