Mahabubabad : మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పిల్లలు తారుమారు.. ఒకరి శిశువును మరొకరికి అప్పగించిన సిబ్బంది
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి దూక్య సుమిత్ర జులై31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్లు రావడంతో ఎస్ఎన్ సీయూలోని బాక్సులో ఉంచారు.

Mahabubabad govt hospital (1)
Mahabubabad Govt Hospital : మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఆస్పత్రి సిబ్బంది పిల్లలను తారుమారు చేసింది. మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చిన్న పిల్లలు తారుమారు కావడం కలకలం రేపింది. నవజాత శిశువుల చికిత్సా కేంద్రం ఎస్ఎన్ సీయూ సిబ్బంది సుమిత్రకు పుట్టిన బాబును సునీతకు అప్పగించారు. గంట తర్వాత సుమిత్ర కుటుంబ సభ్యులు బాబు కోసం వైద్య సిబ్బంది వాగ్వాదానికి దిగారు.
జరిగిన తప్పును గ్రహించిన వైద్య సిబ్బంది సునీత దగ్గరి బాబును సుమిత్రకు అప్పగించడంతో వివాదం సద్దుమనిగింది. మరోసారి ఇలాంటివి జరుగనివ్వబోమని వైద్య సిబ్బంది అంటున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి దూక్య సుమిత్ర జులై31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్లు రావడంతో ఎస్ఎన్ సీయూలోని
బాక్సులో ఉంచారు.
YS Sharmila: 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలు.. బంది పోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదు: షర్మిల
కే.సముద్రం మండలం దస్రు తండాకు చెందిన సునీత ఆగస్టు4వ తేదీన పాపకు జన్మనిచ్చింది. శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఎస్ఎన్ సీయూలోని బాక్సులో ఉంచారు. బాబుకు పాలు ఇవ్వడం కోసం ఎస్ఎన్ సీయూ బాక్స్ నుంచి బాబును బయటికి తీసుకొచ్చిన సిబ్బంది తల్లి సుమిత్రకు ఇవ్వకుండా పాప తల్లి సునీతకు ఇచ్చారు.
వార్డులోని సభ్యులు సునీతకు పాపకు బదులుగా బాబును ఇచ్చారు. అదే వార్డులోని సుమిత్ర తల్లి మనవడిని గుర్తు పట్టడంతో సిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. తప్పును గ్రహించిన సిబ్బంది బాబును సుమిత్రకు అప్పగించారు.బ్లూకోర్స్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.