Transgenders : హైదరాబాద్‌లో దారుణం.. హిజ్రాల మధ్య గొడవ.. ఒక్కసారిగా మంటలు అంటుకొని ఎనిమిది మందికి తీవ్రగాయాలు..
Transgenders : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బోరబండ ప్రాంతంలో రెండు ట్రాన్స్ జెండర్ల గ్రూపుల మధ్య వివాదం చోటు చేసుకుంది.
Transgenders
Transgenders : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బోరబండ ప్రాంతంలో రెండు ట్రాన్స్‌జెండర్ల గ్రూపుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం తీవ్రం కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. దీంతో బోరబండ బస్టాండ్ సమీపంలో ఒక వర్గం నిరసన ధర్నాకు దిగింది. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు ట్రాన్స్‌జెండర్స్ తీవ్రంగా ప్రవర్తించారు.. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
కొందరు ట్రాన్స్‌జెండర్స్ తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంకు యత్నించారు. పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు 50శాతంకుపైగా గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘనటలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
బర్త్ డే పార్టీ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ పడిన గ్రూపుల్లో ఓ వర్గం సభ్యులు మధ్యవర్తి వద్ద పంచాయితీ పెడితే.. ఒక్క వర్గానికే పంచాయితీ పెద్ద వత్తాసు పలికినట్లు చెబుతున్నారు. దీంతో ఓ వర్గం సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ బోరబండ బస్టాండ్ సమీపంలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో పోలీసులు ఘటన స్థలికి వెళ్లి వారిని వారించే ప్రయత్నం చేశారు.
కొందరు ట్రాన్స్‌జెండర్స్ అతిగా ప్రవర్తించడంతోపాటు.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా నిప్పంటుకొని ఎనిమిది మంది ట్రాన్స్ జెండర్లకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
