KCR Kumaraswamy : కుమారస్వామితో ముగిసిన కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చ

జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కుమారస్వామికి వివరించారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఇరువురూ చర్చించారు.

KCR Kumaraswamy : కుమారస్వామితో ముగిసిన కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చ

Updated On : September 11, 2022 / 4:51 PM IST

KCR Kumaraswamy : కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కుమారస్వామికి వివరించారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఇరువురూ చర్చించారు. జాతీయ స్థాయిలో కలిసిరావాలని కుమారస్వామిని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అంతకుముందు ప్రగతిభవన్ కు వచ్చిన కుమారస్వామికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు కేసీఆర్. పుష్పగుచ్చం ఇచ్చి దగ్గరుండి మరీ ఇంట్లోకి తీసుకెళ్లారు.

ప్రగతిభవన్‌లోనే నేతలిద్దరూ కలిసి లంచ్ చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌, కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. బీజేపీని గద్దె దించేందుకు కలిసి రావాలని ఆయా పార్టీల నేతలను కోరారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వచ్చిన కుమారస్వామి.. కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.