Telangana New Secretariat : ఇంకా ఎన్నాళ్లు.. కొత్త సచివాలయం నిర్మాణ పనుల ఆలస్యంపై సీఎం కేసీఆర్ సీరియస్

సచివాలయం నిర్మాణ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి, సంబంధిత అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.

Telangana New Secretariat : ఇంకా ఎన్నాళ్లు.. కొత్త సచివాలయం నిర్మాణ పనుల ఆలస్యంపై సీఎం కేసీఆర్ సీరియస్

Updated On : January 25, 2023 / 8:55 PM IST

Telangana New Secretariat : సచివాలయం నిర్మాణ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి, సంబంధిత అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో పలుమార్లు సమీక్షలు చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో నిర్మాణ పనులు జరిగే ప్రదేశానికి వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికి అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read..Dr. BR Ambedkar Telangana Secretariat : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అధికారులు కూడా వచ్చే నెల ప్రారంభోత్సవం ఉందన్న హడావుడితో కేవలం ముఖ్యమంత్రి చాంబర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో పూర్తి సచివాలయం అందుబాటులోకి తీసుకొచ్చేలా పనుల్లో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. సచివాలయం ప్రారంభోత్సవానికి ఇక 23 రోజుల సమయమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం సమయానికి సచివాలయం మొత్తం పూర్తి చేయాల్సిందేనని అధికారులను సీఎం ఆదేశించారు.

Also Read..Telangana New Secretariat : ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం..హాజరుకానున్న బీఆర్ అంబేద్కర్ మనుమడు

ఇక 6వ అంతస్తులో సీఎం చాంబర్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మించారు. ఆ ఫ్లోర్ మొత్తం దాదాపుగా పూర్తైంది. మిగిలిన అంతస్తుల్లో పనులు జరుగుతున్నాయి. నిత్యం వందల మంది కార్మికులు పని చేస్తున్నప్పటికి పనులు మాత్రం పూర్తి కాకపోవడంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభోత్సం నాటికైనా పనులు పూర్తవుతాయా? లేదా? అని అధికారులను కేసీఆర్ నిలదీసినట్లు తెలుస్తోంది. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి, అధికారులు సమాధానం చెప్పినట్లు సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.