CM KCR : మేం ఆమోదించాం మీరు ప్రవేశపెట్టండి : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని కోరుతు లేఖ రాశారు.

CM KCR : మేం ఆమోదించాం మీరు ప్రవేశపెట్టండి : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

Updated On : September 15, 2023 / 6:01 PM IST

PM Narendra modi.. CM KCR : ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra modi)కి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని కోరుతు లేఖ రాశారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill),బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)ప్రవేశపెట్టాలని కోరుతు లేఖ రాశారు. తమ అసెంబ్లీలో ఈ రెండు బిల్లుల తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించామని ఇక పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టాలని కోరారు.

2014లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని లేఖలో వివరించారు సీఎం కేసీఆర్. 2014లోనే తెలంగాణ అసెంబ్లీ బీసీ రిజర్వేషన్‌కు తీర్మానం చేసామని..ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి బీసీలపట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని లేఖలో సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.