Golconda Fort : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబు.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు.

Golconda Fort independence day
Golconda Fort Independence Day Celebrations : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ రెడీ అయింది. పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ ముస్తాబు అయింది. ఈ సారి గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ముందుగా ఉదయం 9.40 గంటలకు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను సీఎం ఎగరవేయనున్నారు. అనంతరం 9.50 గంటలకు పరేడ్ గ్రౌండ్ కు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ మార్గ చిహ్నం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 10.15 గంటలకు సీఎం గోల్కొండ కోటకు బయలుదేరుతారు.
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.
Delhi : ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఢిల్లీలో భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు
రాణి మహాల్ లాల్ నుంచి గోల్కొండ వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గోల్కొండ కోటకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షేక్ పేట, టోలీ చౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజల వాహనాలను 7 టూమ్స్ లోపల పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటకు వచ్చే ప్రముఖులు, అధికారుల కోసం ప్రత్యేక పాస్ లు జారీ చేశారు.
ఎ గోల్డ్, ఎ పింక్, బి నీలం, సీ గ్రీన్, డీ ఎరుపు పాస్ లను ఇచ్చారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి ఎ గోల్డ్, ఎ పింక్, ఎ నీలం పాస్ లు ఉన్నవారిని గోల్కొండ వరకు అనుమతిస్తారు. స్వాత్రంత్య వేడుకలకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎ గోల్డ్ పాస్ లు ఉన్న వారి వాహనాలను గోల్కొండ మెయిన్ గేట్ ఎదురుగా రహదారి పై ఫతే దర్వాజ రోడ్డు వైపు పార్కింగ్ కు అనుమతిస్తున్నారు.
ఎ పింక్ పాస్ లు ఉన్నవాహనదారులు గోల్కొండ కోట మెయిన్ గేట్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న బస్ స్టాప్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. బి పాస్ లు ఉన్న వాహనాదారులు గోల్కొండ బస్ స్టాప్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాలి.