ఉచిత విద్యుత్‌, 15 వేల పోస్టులు, రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం అమరుల సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుడుతామన్నారు. ఆదిలాబాద్‌ను..

ఉచిత విద్యుత్‌, 15 వేల పోస్టులు, రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Indravelli

Updated On : February 2, 2024 / 7:48 PM IST

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. త్వరలోనే లక్ష మంది అడబిడ్డలకు రూ.500కే సిలెండర్ ఇచ్చే పథకం ప్రారంభిస్తామని చెప్పారు.

త్వరలోనే తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇంకా లక్ష 93 వేల ఉద్యోగల భర్తీ చేసే బాధ్యత తమదని అన్నారు. ఆదిలాబాద్ మట్టికి గొప్పతనం ఉందని.. రంజీ గోండు, కొమురం భీంల ప్రస్తావన లేకుండా చరిత్రనే లేదని అన్నారు.

మాట ఇచ్చిన ప్రకారం అమరుల సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుడుతామన్నారు. ఆదిలాబాద్‌ను దత్తతకు తీసుకుని.. అభివృద్ధి పయనంలో నడిపిస్తామని తెలిపారు. ఇంద్రవెల్లి అమరులకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆదిలాబాద్ జిల్లా సంక్షేమానికి ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు.

ప్రగతి భవన్ వద్ద ఎండలో ఎదురుచూసిన గద్దర్ ఉసురు బీఆర్ఎస్‌కి తగిలిందని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారని, ఊర్లకి వచ్చి ఎవరైనా ఆ మాట అంటే తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇకపై ఈ రాష్ట్రానికి సీఎం కాదు కదా.. మంత్రి కూడా కాలేరని చెప్పారు. దేశంలో పేదల ప్రభుత్వం రావాలంటే.. మోదీని గద్దె దించల్సిందేనని చెప్పారు.

Bandi Sanjay: ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తుచేస్తూ బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే?