Bandi Sanjay: ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తుచేస్తూ బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.

Bandi Sanjay
తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
ఫిబ్రవరి 1 వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాలను ఉంటాయని హామీ ఇచ్చారని అన్నారు. అందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకుని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారని బండి సంజయ్ అన్నారు.
ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని అన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన గ్రూప్ -1తో పాటు గ్రూప్-2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.
Today’s Date : 2-2-2024
What happened to the Group1 appointments?
Congress government in its Abhaya Hastham Manifesto promised Group1 appointments on 1st February.
We waited for a day to see if govt will make any announcement, but typical Congress DNA of cheating people has… pic.twitter.com/J4EZSpCWCh
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 2, 2024
Magunta Sreenivasulu Reddy: టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. కుమారుడు రాఘవ రెడ్డిని బరిలోకి?