టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. బరిలోకి కుమారుడు రాఘవ రెడ్డి?
ప్రస్తుతం మాగుంట ఢిల్లీలో ఉండటంతో టీడీపీతో భేటీ ఆలస్యమైంది. ఈ రోజు ఢిల్లీ నుంచి రాగానే భేటీ జరిగే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట కోసం వైసీపీ అధిష్ఠానంపై సుదీర్ఘ పోరాటం చేశారు బాలినేని.

Magunta
Magunta Sreenivasulu Reddy: టీడీపీ కీలక నేతలతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇవాళ భేటీకానున్నారు. టీడీపీతో చర్చలు సఫలమైతే ఒంగోలు లోకసభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు మాగుంట. అధికార వైసీపీ ద్వారాలు మూసి వేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఎంపీ మాగుంట.
ప్రస్తుతం మాగుంట ఢిల్లీలో ఉండటంతో టీడీపీతో భేటీ ఆలస్యమైంది. ఈ రోజు ఢిల్లీ నుంచి రాగానే భేటీ జరిగే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట కోసం వైసీపీ అధిష్ఠానంపై సుదీర్ఘ పోరాటం చేశారు బాలినేని. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో.. వైసీపీ అధిష్ఠానం వైవీ సుబ్బారెడ్డి మాటకే ప్రాధాన్యం ఇవ్వడంతో బాలినేని పాచికలు పారడం లేదు.
బాలినేని అభిప్రాయానికి భిన్నంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా బరిలోకి దింపనున్నామని బాలినేనికి సమాచారం ఇవ్వడంతోపాటు మరికొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బాలినేని ఊహించని విధంగా జిల్లా ఇన్‌చార్జిగా చెవిరెడ్డిని వైసీపీ అధిష్ఠానం ప్రకటించడంతో ఇక తనకు ఎంపీగా తనకు అవకాశాలు దరిదాపుల్లో లేవని ఎంపీ మాగుంట భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో దారితీసిన పరిణామాలతో టీడీపీలోకి వెల్లాలని నెల క్రితమే భావించారు ఎంపీ మాగుంట. తనదారి తాను చూసుకుంటానని చూరుపట్టుకుని వేలాడలేమని.. తమ కుటుబ పరువును పోగొట్టుకోలేనని బాలినేనికి ఎంపీ మాగుంట చెప్పారు. సీఎం జగన్ ను ఒప్పిస్తానని ఓపిక పట్టాలంటూ బాలినేని చర్చలు సాగించడంతో ఇంతకాలం ఆచితూచి వ్యవహరించారు మాగుంట.
Also Read: ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష.. అంతకుముందు పలువురు నేతలను కలిసి..