Cm Revanth Reddy Delhi Tour : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే.. ఆ తర్వాత విదేశీ పర్యటన ప్రారంభం..

ఢిల్లీ పర్యటన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.

Cm Revanth Reddy Delhi Tour : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే.. ఆ తర్వాత విదేశీ పర్యటన ప్రారంభం..

Updated On : January 14, 2025 / 6:51 PM IST

Cm Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం కానుండగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కూడా పాల్గొంటారని సమాచారం. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

సింగపూర్ కు సీఎం రేవంత్ బృందం..
ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ నుంచి సింగపూర్ కు వెళ్లనుంది సీఎం బృందం. అక్కడ బిజినెస్ మీట్ లో పాల్గొని పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఇక జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్ కు వెళ్తారు. 20, 21, 22 వ తేదీలలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.

రెండు రోజులు ఢిల్లీలోనే.. ఆ తర్వాత ఫారిన్ టూర్..
రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండబోతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ప్రారంభం అవుతుంది. మొదట సింగపూర్ వెళ్తారు. జనవరి 19 నుంచి 20 వ తేదీ వరకు సింగపూర్ లోనే ఉంటారు. అక్కడ ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలతో బిజినెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.

Also Read : బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సింగపూర్ లో బిజినెస్ మీట్.. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ..
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి సింగపూర్ లో సోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన క్రీడా మైదానాలను ఆయన పరిశీలించబోతున్నారు. అలాగే, షాపింగ్ మాల్స్ ను కూడా ఆయన పరిశీలించబోతున్నారు. ఒకవైపు బిజినెస్ పరంగా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ ఉండబోతోంది.

షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సం ఉండటంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. ముందుగా ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ అండ్ టీమ్ ఫారిన్ టూర్ ప్రారంభం కానుంది.

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొననున్న సీఎం రేవంత్ టీమ్..
ప్రధానంగా ప్రతి ఏటా జరిగే దావోస్ బిజినెస్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన తన బృందంతో పాల్గొనబోతున్నారు. గత ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి అంతకు మించిన పెట్టుబడులను సాధించడమే సీఎం రేవంత్ టూర్ లక్ష్యంగా ఉండబోతోంది. ఈ విదేశీ పర్యటనలపై తెలంగాణ భారీ ఆశలు పెట్టుకుంది. భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం టూర్ ఉండబోతోంది.

 

Also Read : నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. ఎంపీ అర‌వింద్‌పై సంజయ్ ప్రశంసలు