Group 1 Exam 2024: గ్రూప్-1 పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ట్విట‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్టు

గ్రూప్ -1 అభ్యర్థుల పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన కొద్ది సేపటికే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు.

Group 1 Exam 2024: గ్రూప్-1 పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ట్విట‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్టు

CM Revanth Reddy

Updated On : October 21, 2024 / 2:29 PM IST

CM Revanth Reddy: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటీషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ -1 అభ్యర్థులు పిటీషన్ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.. జీవో 55నే అమలు చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అభ్యర్థుల పిటిషన్ పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వంకు ఊరట లభించడంతోపాటు.. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష యథావిధిగా ప్రారంభమైంది.

Also Read: Unstoppable Season 4 : సీఎం చంద్ర‌బాబు కోసం కూర‌గాయ‌ల షాప్ సెట్ వేసిన బాల‌య్య‌.. త్వ‌ర‌లో ఆహాలో అన్‌స్టాప‌బుల్

గ్రూప్ -1 అభ్యర్థుల పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన కొద్ది సేపటికే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరువుతున్న అబ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పున: నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Allu Arjun : ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్.. నంద్యాల ఇష్యూకి సంబంధించి..

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.
563 పోస్టుల భర్తీకోసం గ్రూప్ – 1 పరీక్షలు.
పరీక్ష రాయనున్న 31,383 మంది అభ్యర్థులు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.
టీజీపీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ.
ఇవాళ్టి నుంచి ఈ నెల 27వరకు జరగనున్న పరీక్షలు.