జిల్లా ఇంఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కీలక కామెంట్స్..
గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

CM Revanth Reddy
Telangana Congress PAC Meeting: జిల్లా ఇంఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ సహా మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఏసీలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల ఇంఛార్జి మంత్రుల పనితీరు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు.
Also Read: రాజకీయంగా కలిసి రావడం లేదా? అందుకే కవిత ఆ పని చేస్తున్నారా..? అసలు బంజారాహిల్స్‌లో ఏం జరుగుతోంది?
జూబ్లీహిల్స్ ఎన్నికలపై దృష్టిపెట్టాలని రేవంత్ అన్నారు. ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలి. పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలి. పార్టీ కమిటీలలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాల ఇంచార్జి మంత్రులపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంచార్జి మంత్రులు నెగ్లెట్ గా ఉంటున్నారు.. ఇకనుంచి పద్దతి మార్చుకోవాలని, సీరియస్ గా పనిచేయాలని సూచించారు.
పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోకేల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నారేటివ్ బిల్డప్ చేసుకోవాలని సూచించారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. పార్టీ సీనియర్ నేత వీ. హన్మంతరావు మాట్లాడుతూ.. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేదన్నారు. కొత్తగా వచ్చిన వారు పాతవారితో సమన్వయం చేసుకుంటేనే పార్టీ బలం పెరుగుతుందని వీహెచ్ సూచించారు.