Indiramma House Scheme : ఇంటి స్థలం, రూ.5లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్

పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Indiramma House Scheme : ఇంటి స్థలం, రూ.5లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్

Indiramma House Scheme

Indiramma House Scheme : ఇళ్ల పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ స్కీమ్ ను వర్తింపజేయలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేయగా.. మరొక దాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదే ఇందిరమ్మ ఇళ్లు పథకం. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే దిశగా ఈ నెల 11న ఈ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటు రూ.5లక్షలు.. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ప్రభుత్వం అందజేయనుంది.

ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
* తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు
* ఇల్లు లేని నిరుపేదలందరికీ ఈ పథకం వర్తింపు
* ప్రజా పాలనతో నమోదు చేసుకున్న వారికి తొలుత ప్రాధాన్యం
* లబ్దిదారులు తమకు నచ్చినట్లు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినా.. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశం.

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ స్కీమ్ మార్గదర్శకాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రజాపాలనలో నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరక్కుండా అసలైన అర్హులకు లబ్ది జరిగేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దశలవారిగా ఇల్లు లేని పేదల సొంతింటి కలను నేరవేర్చడం తమ ప్రభుత్వం సంకల్పం అని సీఎం రేవంత్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న అర్హులకు అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కూడా ఇవ్వనుంది.

ఒక వంటగది, టాయిలెట్ మస్ట్..
ఏయే దశలలో ఈ నిధులను విడుదల చేయాలి అనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. లబ్దిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. సొంత స్థలంలో ఇంటిని కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సూచించారు సీఎం. లబ్దిదారులు తమకు నచ్చినట్లుగా ఇంటి నిర్మాణం చేపట్టినప్పటికీ.. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

Also Read : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?