Cm Revanth Reddy : ఎనీ సెంటర్.. నేను రెడీ.. దమ్ముందా..! విపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పన్నెండేళ్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. ఇవాళ చర్చకు సిద్ధమా..

Cm Revanth Reddy : ఎనీ సెంటర్.. నేను రెడీ.. దమ్ముందా..! విపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

Updated On : February 21, 2025 / 11:36 PM IST

Cm Revanth Reddy : నారాయణపేట జిల్లా పర్యటనలో విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో మోదీ పాలనపైనా విమర్శలు గుప్పించారు. డేట్, సెంటర్ చెప్పండి.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, పన్నెండేళ్ల మోదీ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు మేం సిద్ధం.. మీరు చర్చకు వస్తారా? అంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

”పదేళ్లు నా మీద కక్షతో పాలమూరు మీద పగతో కేసీఆర్ ప్రాజెక్ట్ ను పక్కన పెడితే ఈరోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ముదులిపి పనులు మొదలు పెట్టాను. ఇవాళ 5వేల కోట్ల రూపాయలతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే.. ఇవాళ పగబట్టి అడ్డుకుంటున్నారని.. టీవీలలో, పేపర్లలో ఆయన అంటున్నారు.

పదేళ్లలో మీరు చేయని పనులు మేము చేశాం కదా. పాలన ఏమీ బాగోలేదట. ఆయన కొడితే గట్టిగా కొడతాడట. గట్టిగా కొట్టాలంటే ముందు మీ ఇంట్లో వాళ్లను కొట్టి వారిని దారిన పెట్టండి. కాంగ్రెస్ ను గట్టిగా కొడతానంటే.. మా పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా. చిత్తశుద్ధి ఉంటే మీరు రండి.

Also Read : అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్లే కోవర్టులు, చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది- మధుయాష్కీ సంచలనం

ఏ ఊరిలో అయితే మా ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయో అక్కడ మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో మేమసలు పోటీనే చేయం. మీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లున్న ఊర్లలోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ ను స్వీకరించు. మాట్లాడు. మీరేం చేశారో, మేమేం చేశామో ప్రజలకు అర్థమవుతుంది.

ఇవాళ మన మీద పగబట్టారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మన పరిపాలన బాగోలేదని అంటున్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పన్నెండేళ్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి. మీ పార్టీ ప్రెసిడెంట్ గా మీరు రండి. కేంద్ర మంత్రిగా మీరు రండి.

Also Read : జగన్ సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా? మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా?- మంత్రులపై జగదీశ్ రెడ్డి ఫైర్

ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ ప్రెసిడెంట్ గా కేసీఆర్ మీరు రండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేనొస్తా. పన్నెండేళ్ల మోదీ పరిపాలన మీద, పదేళ్ల కేసీఆర్ పాలన మీద, 12 నెలల మా ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా” అని సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.