Revanth Reddy : రానున్న డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం : రేవంత్ రెడ్డి
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.

Revanth Reddy (11)
Congress Govt Free Electricity : పదవి త్యాగం చేయడంలో సోనియా గాంధీని మించిన వారు ఎవరూ లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 కావడంతో రానున్న డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఇందిరా బంధు పేరుతో రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని వివరించారు. అలాగే కౌలు రైతులకు కూడా ఎకరాకు రూ.15 వేల రూపాయలు, కూలీలకు రూ.12 వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని పేర్కొన్నారు.
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు. వీటితోపాటు పలు హామీలను మ్యానిఫెస్టోలో పెట్టామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2 లక్షల నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాలు చేసినట్లు తెలిపారు.