TPCC : కోమటిరెడ్డి వ్యాఖ్యలను తర్జుమా చేసి ఢిల్లీకి పంపిన కాంగ్రెస్ నేతలు.
టీపీసీసీ నియామకంపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. దీనిపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా సమాచారం. ఓటుకు నోటు కేసు మాదిరిగానే టీపీసీసీ నియామకం జరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేందుకు ఎవరు రావద్దని తెలిపారు

Tpcc
TPCC : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. అయితే రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంపై ఆ పార్టీలోకి కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇక రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యక్తులు చేశారు. డబ్బులు తీసుకోని టీపీపీసీ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు హై కమాండ్ దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలోని నేతలకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వ్యాఖ్యల గురించి ఆరా తీశారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలను ట్రాన్స్ లేట్ చేసి పంపాలని రాష్ట్రనేతలకు కోరినట్లు సమాచారం. దీంతో రాష్ట్రనేతలు కోమటిరెడ్డి మాటలను ట్రాన్స్ లేట్ చేసి పంపారు. ఇక ఇదే అంశంపై మాణిక్కం ఠాగూర్ స్పందించారు. హై కమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని తెలిపారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలు హై కమాండ్ ను దిక్కరించేలా ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హై కమాండ్ సూచనతో కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లురవి, షబ్బీర్ అలీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కేసీఆర్ సూచనల మేరకే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
ఇక ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి
ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు. హుజూరాబాద్‌లో రాబోయే ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీ టీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. రేవంత్‌రెడ్డి సహా ఎవరూ కలిసేందుకు ప్రయత్నించొద్దని కోమటిరెడ్డి తెలిపారు.