Jagga Reddy : కేసీఆర్ తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి : జగ్గారెడ్డి సెటైర్లు

బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. మాలో సీఎం ఎవరో నాకు ఫుల్ క్లారిటీ ఉంది అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Jagga Reddy : కేసీఆర్ తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి  : జగ్గారెడ్డి సెటైర్లు

Jagga Reddy

Updated On : November 6, 2023 / 3:24 PM IST

Jagga Reddy..CM KCR : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ మరికొన్ని రోజులే ఉంది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్నకొద్దీ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ పార్టీ విజయం సాధిస్తుంది అంటే.. కాదు తమ పార్టీదే గెలుపు అంటూ ఏపార్టీకి ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.  అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మరోపక్క బీజేపీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తు.. సభలు, సమావేశాలు, ర్యాలీలతో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేసీఆర్ తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అంటూ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు.

ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకొస్తుందని..అదే సెంటిమెంట్ లో ప్రజల్ని రెచ్చగొడతారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు..సోనియా, రాహుల్, ఖర్గే ఆలోచించి..అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తారని వెల్లడించారు. అధిష్టానం సీఏం ఎంపిక విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉందంటూ చెప్పుకొచ్చారు. మరోసారి గెలిచేది లేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదీ లేదు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ భయం పట్టుకుంది అన్నారు.

YS Sharmila: బీజేపీకి సవాల్ చేస్తున్న.. మీరు నిజాయితీ పరులైతే వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించండి

మా పార్టీలో ప్రధాన నాయకుల టీమ్ అంతా ఫుల్ యాక్టివ్ గా ఉందన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఈసారి తాము ఓడిపోక తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ కి ఇప్పటికే అర్థం అయిదన్నారు. కర్నాటక ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మిస్ గైడ్ చేస్తోంది అంటూ విమర్శించారు. అబద్ధాలు చెప్పి బయటపడాలని కేసీఆర్ భావిస్తున్నారు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ అవారా పార్టీగా మారింది అంటూ సెటైర్లు వేశారు.

సోనియా, రాహుల్ మా పార్టీకి తల్లితండ్రులు..కాంగ్రెస్ పార్టీలో తామంతా పిల్లలం అన్నారు. తమపై చేసే విమర్శలకు హరీష్ రావుకి సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తానని..కాంగ్రెస్ హవా పెరగటంతో హరీష్ రావుకి నిద్ర కరువైందని అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు. 50 డ్యాములు కట్టిన కాంగ్రెస్ ఎక్కడ…? ఒక్క డ్యామ్ కే సినిమా చూపిస్తున్న బీఆర్ఎస్ ఎక్కడ? అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల కోడ్ వచ్చేముందు అన్ని వాగ్ధానాలు ఇచ్చారు..ఒక్క జీవో కూడా బయటకి రాలేదన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల గురించి కేసీఆర్ ఆలోచించారా? అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ పిలిచి ఒక్క పూటైనా అన్నం పెట్టారా..? అంటూ ప్రశ్నించారు. అమరుల కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదు..?కొందరు అమాయకులను చంపి వాళ్ళ చేతిలో చిట్టిలు పెట్టిన వాళ్ళు ఎమ్మల్యేలు, ఎంపీలు అయ్యారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Thummala Nageswara Rao : రైతుకు అన్నం పెట్టేది తుమ్మ, పనికి రాని పువ్వు పువ్వాడ- సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్

బీఆర్ఎస్ నాయకులు గెలుపు తమదే నంటూ భీరాలు పలుకుతున్నారు..కానీ ఏ యూనివర్సిటీలకు ఎందుకు వెళ్ళలేక పోతున్నారు?అంటూ ప్రశ్నించారు. ఏంఐఏం సినిమా హైదరాబాద్ లోనే నడుస్తది తప్ప మరెక్కడా పనిచేయదన్నారు. ఏంఐఏం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ విమర్శించారు.తెలంగాణలో కాంగ్రెస్ రాకూడదని మోదీ, కేసీఆర్ కలిసి ప్లాన్లు వేస్తున్నారని ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా వచ్చేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.కవిత జైలుకి వెళ్తదని బండి సంజయ్ రోజూ ఉపన్యాసాలు ఇచ్చాడు..కానీ కవిత అరెస్ట్ డ్రాప్ కాగానే బీజేపీ పని ఖతం అయిందని నోరు విప్పినందుకే బండి సంజయ్ అవుట్ అయ్యాడు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీలో ఎవరైనా మాట్లాడితే అధిష్టానం ఊరుకోదు..కానీ కాంగ్రెస్ పార్టీలో అలాకాదు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.